గ్రామాలలో గొర్రెలు,మేకల మేతకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే దాణా సరఫరా చేయాలి
On
విశ్వంభర, జనగామ : జిల్లాలో పశు వైద్య శాలల్లో మందులు అందుబాటులో ఉంచాలని జీఎంపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాదం రమేష్ గొర్రెలు మేకల పెంపకందార్ల సంఘం (జీ ఎం పి ఎస్) జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శి సాదం రమేష్ శనివారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లో ఉన్నటువంటి గొర్రెలు, మేకలకు మేతకు సంబంధించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటి పోషణ భారంగా మారిందని మేత వనరులు కోసం దూర ప్రాంతాలకు వలస వెల్లవలసిన పరిస్థితులు నెలకొన్నాయి అన్నారు. ప్రభుత్వం గొర్లకాపరుల సమస్యలపైన దృష్టి పెట్టి జీవాలకు సంబంధించిన దాణాను ఉచితంగా ప్రభుత్వం సరఫరా చేయాలని వరి కోతలు ముగిసే వరకు జీవాలకు దాణా అందించాలని పశు సంవర్ధక శాఖ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తగు నిర్ణయం తీసుకొని వలస గొర్ల కాపరులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.



