ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ఏడు లక్షల రూపాయలు మంజూరు.
On
విశ్వంబర, హైదరాబాద్ : పాతబస్తీ చంద్రాయణ గుట్ట నియోజకవర్గంలోని శ్రీశ్రీశ్రీ స్వయంభు చెన్నకేశ్వర స్వామి యొక్క ఐదు రోజులపాటు జరగనున్న బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని దేవాలయ మెట్ల దారి మరియు ఆలయ అభివృద్ధికై ప్రభుత్వం ఏడు లక్షల రూపాయలు మంజూరు చేసిందని చంద్రాయణ గుట్ట నియోజకవర్గం ఇన్ ఛార్జ్ బోయ నగేష్ తెలిపారు. మరియు స్వామివారి మెట్ల దారి యొక్క పనులను పూజా కార్యక్రమం చేసి ప్రారంభించారు. ఈ యొక్క కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ మహేష్ కుమార్ గౌడ్. మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.



