ఉడ్ -బాల్  టోర్నమెంట్ లో తెలంగాణ రాష్ట్ర  ప్రభంజనాలు 

ఉడ్ -బాల్  టోర్నమెంట్ లో తెలంగాణ రాష్ట్ర  ప్రభంజనాలు 

విశ్వంభర, కర్నూల్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలోని   స్పోర్ట్స్  అథారిటీ  ఆఫ్ ఇండియా   అవుట్  -  డోర్   స్టేడియంలో తేదీ.28-0-2025 నుండి   తేదీ.29-01-2025  వరకు జరిగిన 2వ సౌత్ జోన్  సబ్ -  జూనియర్  జూనియర్ ,  సీనియర్   ఉడ్  - బాల్  ఛాంపియన్షిప్   టోర్నమెంట్  లో  తెలంగాణ రాష్ట్ర జట్టు తరపున పాల్గొన్న క్రీడాకారులు సీనియర్ సింగిల్ బాలుర - విభాగంలో ఎస్. ఫణి కుమార్  ఫైనల్  లో తమిళనాడు రాష్ట్రం జట్టు వర్సెస్  తెలంగాణ రాష్ట్రo  జట్లు  హోరాహోరీగా పోరాడి  తెలంగాణ జట్టు రెండవ స్థానం,  వెండిపతకాన్ని   కైవసం  చేసుకుంది. మరో   సీనియర్ సింగిల్ బాలుర విభాగంలో బి. అవినాష్ , సెమీ ఫైనల్లో  పాండిచ్చేరి  రాష్ట్రం జట్టు  వర్సెస్    తెలంగాణ రాష్ట్రం  జట్టు  పోరాడి మూడవ  స్థానం, రజత పతకాన్ని సాధించింది.  అలాగే సబ్-  జూనియర్  బాలురు -గ్రూప్ విభాగంలో ,  జే. విష్ణు, ఆర్.  జశ్వంత్, బి.  శశివర్ధన్, పి విగ్నేష్ కుమార్, లు ఫైనల్  లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జట్టు   వర్సెస్ తెలంగాణ  రాష్ట్ర  జట్లు  హోరా -  హోరీగా,  పోరాడి   తెలంగాణ రాష్ట్ర    జట్టు  మొదటి స్థానం, బంగారు - పతకాన్ని సాధించింది. అలాగే జూనియర్ - గ్రూప్      బాలుర - విభాగంలో  ఏ. కార్తీక్, పి. తానేష్, డి. విజయ్ కుమార్,   లు  ఫైనల్  లో ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర జట్టు  వర్సెస్  తెలంగాణ రాష్ట్ర  జట్లు   తలపడగ   తెలంగాణ   రాష్ట్ర  జట్టు  రెండవ స్థానం, వెండి పతకన్ని కైవసం చేసుకుంది.  2వ సౌత్ జోన్  ఉడ్ - బాల్  ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో   తెలంగాణ   రాష్ట్రనికి    బంగారు,  వెండి ,  రజత,    పతాకాలను   సాధించిన  తెలంగాణ రాష్ట్ర  జట్ల  క్రీడాకారులను, ఉడ్ - బాల్  అసోసియేషన్   తెలంగాణ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి. కె. ఆదర్శ్ , ఉమ్మడి  రంగారెడ్డి జిల్లా  ఉడ్  - బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.డి రహమత్, క్రీడాకారులకు ప్రత్యేకంగా అభినందనలు   తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్  ఎస్. ఫణి , బి. నవీన్, బి.అవినాష్,   తదితరులు పాల్గొన్నారు.

 

Read More అపదలో అండగా నిలిచిన బిఆర్ఎస్ నాయకులు

Tags: