తెలంగాణ ఉద్యమ కారుల మహిళా వేదిక శిక్షణ తరగతుల కరపత్రాల ఆవిష్కరణ

తెలంగాణ ఉద్యమ కారుల మహిళా వేదిక శిక్షణ తరగతుల కరపత్రాల ఆవిష్కరణ

విశ్వంభర, హైదరాబాద్ : తెలంగాణ ఉద్య మకారుల మహిళావేదిక (ట్రియుఎంవి) ఆద్వర్యంలో ఆదివారం 9 వ తేదీ న మేడిపల్లి, పిర్ఖారి గూడ, ఉప్పల్  లో జరుగబోయే ఉద్యమ కారుల మహిళా శిక్షణా తరగతుల కరపత్రాలను తెలంగాణ ఉద్యమకారుల జె.ఏ.సి చైర్మన్ సుల్తాన్ యాదగిరి, ప్రదాన కార్యదర్శి టి. ప్రపుల్ రాంరెడ్డి,  జూపాక సభద్ర లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుల్తాన్ యారి యాదగిరి మాట్లాడుతూ ఈ శిక్షణ  తరగతుల్లో మహిళలు కూడా అన్ని రంగాలలో రాణించే విధంగా వారికి ప్రత్యేక శిక్షణ , ప్రభుత్వం ఉద్యమ కారులకు చేసిన మోసాల గూర్చి, రాజ్యాంగంపై, ప్రజాస్వామ్యంపై జరుగు చున్న దాడుల గూర్చి, సనాతన దర్మాలపై మత వాదులు చేస్తున్న అసంబద్ద ప్రచారాలపై, మహిళలపై జరుగు-చున్న అత్యాచారాలపై శిక్షణా శిబిరాలు ఉంటాయని ఆన్నారు. అంతేకాకుండా రాజకీయ నాయకుల, ప్రొఫెసర్లు, రచయితలు, నిష్ణాతులైన వక్తల ప్రసంగాలు ఉంటాయన్నారు.  కార్యక్రమంలో గోరువ్యామల,  కొడాదికారి చంద్రన్నప్రసాద్, కళాకారుల వేదిక ప్రధాన కార్య దర్శి డోలక్ యాదగిరి ధనలక్ష్మి లావణ్య తదితరులు పాల్గొన్నారు.

Tags: