వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా సురేంద్రమోహన్
On
విశ్వంభర, ఎల్బీనగర్ : వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా చార్జి తీసుకున్న సురేంద్రమోహన్ ( ఐఏఎస్) ను టీఎన్జీవో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల రాష్ట్ర ఫోరం అధ్యక్షుడు చిలక నరసింహారెడ్డి, కార్యదర్శి ముక్రం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. వీరితో పాటు సహాధ్యక్షులు వెంకటేశం, సెంట్రల్ యూనియన్ ఈసీ మెంబర్ సంతోష్, హైదరాబాద్ ఎస్ జి ఎస్ దామోదర్, హాలియా స్పెషల్ జిఎస్ వెంకట్ రెడ్డి, ఆమనగల్లు కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి లు పాల్గొన్నారు.



