విజయవంతంగా వాలీబాల్ ప్రీమియర్ లీగ్

విజయవంతంగా వాలీబాల్ ప్రీమియర్ లీగ్

విశ్వంభర, ఆమనగల్లు: మండల కేంద్రంలో ఇండియన్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ విధానంతో  ఆమనగల్లు వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆమనగల్లు వాలీబాల్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించారు. రెండు రోజులు నిర్వహించిన  ఈ టోర్నమెంటులో  మొత్తం పది జట్లు హోరా హోరిగా పాల్గొనగా విన్నర్ గా స్ట్రైకర్స్  జట్టు మొదటి స్థానంలో, రన్నర్ గా లోకల్ స్టార్స్ జట్టు నిలిచాయి. టోర్నమెంట్ కు ముఖ్య అతిథులుగా ప్రముఖ సంఘ సేవకులు పాపిశెట్టి రాము, వాలీబాల్ సీనియర్ క్రీడాకారుడు మనోహర్ రెడ్డి హాజరై గెలుపొందిన జట్లకు  బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినూతన తరహాలో వాలీబాల్ ప్రీమియర్ లీగ్ నిర్వహించడం సరికొత్తగా ఉంది, ఇలాంటి టోర్నమెంటులతోనే  ప్రతిభ ఉన్న క్రీడాకారులను  వెలికి తీయవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు లండన్ జగన్ (జె.ఎస్), పవన్ కళ్యాణ్, ఆమనగల్లు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు వగ్గు మహేష్, ఏనమల రమేష్, కోరే మహేందర్, ఆర్గనైజర్లు గోరటి దేవేందర్, కోరే రవి, సురేష్, చాంద్ పాషా, గౌస్, భరత్, మల్లేష్, వెంకట్, క్రీడాకారులు, ప్రేక్షకులు పాల్గొన్నారు.

Tags: