కురవి జాతరకు ప్రత్యేక బస్సులు

కురవి జాతరకు ప్రత్యేక బస్సులు

విశ్వంభర, మహబూబాబాద్: బుధవారం జరుగుచున్న మహాశివరాత్రి పండుగ నాడు శ్రీ కురవి వీరభద్ర స్వామి జాతర సందర్భంగా మహబూబాబాద్ డిపో నుండి ప్రత్యేక బస్సులను కురవికి నడుపుచున్నామని డిపో మేనేజర్ శ్రీ ఎం శివప్రసాద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. బుధవారం ఉదయం 5:00 గంటల నుండి ప్రత్యేక బస్సులను గురువారం వరకు నడుపుతున్నామని, ఇట్టి ప్రత్యేక బస్సులలో మహబూబాబాద్ నుండి కురవికి పెద్దలకు టికెట్టు 30 రూపాయలు, పిల్లలకు 20 రూపాయలుగా నిర్ణయించినామని, ఈ ప్రత్యేక బస్సులు మహబూబాబాద్ బస్ స్టేషన్ నుండి తొర్రూర్ బస్టాండు ప్రాంతం నుండి, రైల్వే స్టేషన్ ప్రాంతం నుండి, కురవి గేట్ ప్రాంతం నుండి నడపబడునని తెలిపారు. మరిపెడ బంగ్లా నుండి కూడా కురవి జాతరకు రెండు ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేయడమైనది. బంగ్లా నుండి కురవికి పెద్దలకు 40 రూపాయలు, పిల్లలకు 30 రూపాయలు టికెట్టు. ఇవే కాకుండా ఖమ్మం, సూర్యాపేట రూట్ నందు నడుచు ప్రతి పల్లె వెలుగు బస్సు కూడా కురవి జాతర ప్రయాణికులను ఎక్కించుకొని నడపబడునని డిపో మేనేజర్ శ్రీ ఎం శివప్రసాద్ తెలియజేసినారు. ఇట్టి సదవకాశాన్ని ప్రజలు ప్రయాణికులు వినియోగించుకుని కురవి శ్రీ వీరభద్ర స్వామి ఆశీస్సులు పొంది డిపో అభివృద్ధికి పాటుపడాలని ఆయన కోరారు.

Tags: