ఘనంగా సోమిడి తాళ్లపద్మావతీ ఒలంపియాడ్ స్కూల్లో స్కిన్ టిల్లా 2025 వేడుకలు
విశ్వంభర, హన్మకొండ : కాజీపేట మండలం లోని సోమిడి లో తాళ్ల పద్మావతి స్కూల్లో జరిగిన స్కిన్ టిల్లా 2025 వేడుకలు చైర్మన్ తాళ్ల మల్లేశం డైరెక్టర్ వంశీ వరుణ్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాజీపేట ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామారావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే విద్యను ఆటపాటలను అవలంబించాలని అన్నారు. విద్యార్థులకు తల్లిదండ్రులు చిన్ననాటినుండే పిల్లలకు విద్య యందు ఆట పాటలపై శ్రద్ధ చూపాలని అన్నారు. ఈ విధంగా చేసినట్లయితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. డైరెక్టర్ వంశీ మాట్లాడుతూ తాళ్ల పద్మావతి స్కూల్ లో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఇలాంటి విద్యార్థుల వలన మా తాళ్ల పద్మావతి స్కూలుకు ఎంతో గాను పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కాజిపేట ట్రాఫిక్ ఎస్సై రామారావు, పాడుతా తీయగా ఫేమ్ యాగప్రియ హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు తాళ్ళవరుణ్,వైష్ణవి,తాళ్ల వంశీ,చైతన్య,హెడ్మాస్టర్, ఉపాద్యాయుని,
ఉపాద్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.