ఘనంగా శ్రీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవాలు
On
విశ్వంభర, చేవెళ్ల : చేవెళ్ల మండల పరిధిలోని దేవరంపల్లి గ్రామంలో శ్రీ అనంతపద్మనాభ స్వామి వార్షికోత్సవం ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి చేవెళ్ల బిజెపి యువ నాయకుడు డాక్టర్ వైభవ్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మండల బీజేపీ అధ్యక్షులు అత్తిలి అనంతరెడ్డి, శేఖర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి , జయసింహారెడ్డి , మల్లారెడ్డి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.



