నేటి కలెక్టరేట్ వద్ద ధర్నాకు తరలిరావాలి. - విహెచ్పిఎస్ జిల్లా నేత రాజు.

నేటి కలెక్టరేట్ వద్ద ధర్నాకు తరలిరావాలి. - విహెచ్పిఎస్ జిల్లా నేత రాజు.

విశ్వంభ,నెల్లికుదురు: ఆసరా చేయుత పెన్షన్ లు పెంచాలని కోరుతూ పద్మశ్రీ మందకృష్ణ పిలుపుమేరకు నేడు కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా ముట్టడికి తరలిరావాలని పిహెచ్పిఎస్ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు మద్ది రాజు వికలాంగులు,వృద్ధులు, చేనేత,గీత,ఒంటరి పెన్షన్ దారులకు పిలుపునిచ్చారు. పెన్షన్ దారుల సమావేశం ఆదివారం విహెచ్పీఎస్ మండల అధ్యక్షులు బండారి సారంగం అధ్యక్షతన జరిగింది. దీనికి ఆయన హాజరై మాట్లాడుతూ..అన్ని రకాల పెన్షన్లు పెంచుతామని ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సలుగు అశోక్,కోల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: