తేజ ఇంటర్నేషనల్ స్కూల్ లో శివరాత్రి వేడుకలు

తేజ ఇంటర్నేషనల్ స్కూల్ లో  శివరాత్రి వేడుకలు

విశ్వంభర, హన్మకొండ :  తేజ ఇంటర్నేషనల్ స్కూల్ లో  లోకకల్యాణార్థమై మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తేజ ఇంటర్నేషనల్ స్కూల్‌లో  చైర్మన్ ఆఫ్ స్కూల్ డైరెక్టర్ సృజన పివి రమణ రెడ్డి ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుండి  ప్రతి శివరాత్రి రోజు శివ కళ్యాణం చేస్తూ పుట్టమన్నుతో శివలింగం తయారు చేసి వచ్చిన భక్తులు అందరితోని పంచామృతాలు, పండ్ల రసాలు, పంచ ద్రవ్యములతో   స్వామివారికి అర్చన బిల్వదళాలతో నానా రకాల పుష్పాలతో అర్చన చేసి ఆ యొక్క స్వామి వారికి అందరు కూడా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో యొక్క అభిషేక కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తేజ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపల్  పల్ల సృజన రమణారెడ్డి, ఉపాధ్యాయులు విద్యార్థులు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Tags: