ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

ఘనంగా శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

విశ్వంభర, ఆమనగల్లు: సూర్యవంశ ఆరెకటిక సంఘం ఆమనగల్లు ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. హిందూ సమాజానికి ఆయన సేవలను కొనియాడడం జరిగింది అదేవిధంగా చత్రపతి శివాజీ విగ్రహ నుండి బస్టాండ్ రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆరెకటిక సంఘం నూతన అధ్యక్షుడు కమ్లేకార్ సుభాష్, ఉపాధ్యక్షుడు మల్కెడి యాదిలాల్ లను ఏకగ్రీవంగా ఎన్నుకొని వారిని శాలువతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్కేడి శ్రీనివాస్, యాదిలాల్, నిరంజన్ ,శ్రీను రమేష్, అమర్ సెన్, శంకర్ బబ్లు ,సుమన్ కుమార్, శ్రీను శ్రీధర్ ,మరియు పాపిశెట్టి రాము, శ్రీకాంత్ సింగ్, పాతకోట శ్రీశైలం, శివ, తదితరులు పాల్గొనడం జరిగింది.

Tags: