శివరాత్రి మహోత్సవానికి ముస్తాబవుతున్న శివాలయాలు
On
విశ్వంభర, జూలూరుపాడు: మహా శివరాత్రి మహోత్సవాలలో భాగంగా మండల కేంద్రంలో ఉన్న శివాలయాలు పార్వతీ పరమేశ్వరులు దేవతకళ్యాణ మహోత్సవానికి ముస్తాబవుతున్నాయి. పాపకొల్లు గ్రామంలో వేయించి ఉన్న శ్రీ ఉమామహేశ్వర ఆలయం, బేతలపాడు గ్రామ సమీపంలోని సోమన్న లొద్ది, కాకతీయుల కాలం నాటి సోమన్న స్వామి ఆలయం. గాంధీనగర్ గ్రామంలోని కొండపై వెలసిన ఉమామహేశ్వర ఆలయం ముస్తాబవుతున్నాయి. ఈ కళ్యాణ మహోత్సవానికి మండల నలుమూలల నుండి భక్తులు అధిక సంఖ్యలో హజరై స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకిస్తారు.



