సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ముగింపు వేడుకలు
* పాల్గొన్న మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్
On
విశ్వంభర, మహబూబాబాద్: ఇల్లందు పట్టణంలోని సింగరేణి గ్రౌండ్ లో సంత్ శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ముగింపు వేడుకల్లో ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రజలకు ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ ఛైర్మన్ రాంబాబు, మున్సిపల్ ఛైర్మన్ డీ వెంకటేశ్వర్లు, ప్రేమ్ చంద్, నాగేశ్వర్ రావు, బాణోత్ సుజాత, సుశీల బాయ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ డానియల్, పులి సైదులు, దానియకుల రామారావు,నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు భూక్యా ధల్ సింగ్ నాయక్,ప్రవీణ్ నాయక్ బంజారా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



