శ్రీ దేవి నవరాత్రోత్సవాలలో సందర్భంగా పుల్లెంల గ్రామంలో కుంకుమ పూజ
విశ్వంభర, చండూర్ ;- పుల్లెంల గ్రామంలోని రామాలయం దగ్గర ఏర్పాటు చేసిన అమ్మవారి పూజా కార్యక్రమంలో భాగంగా నేడు 5వ రోజు మహాలక్ష్మీ అవతారంలో అమ్మ వారికి చెరుకు లింగయ్య- సైదమ్మ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సౌభాగ్యానికి చిహ్నం కుంకుమ పూజ. కుంకుమ పూజ అనేది దుర్గాదేవి లేదా ఇతర దేవతలకు కుంకుమ సమర్పించే ఒక ఆచారబద్ధమైన పూజ. ఇది సౌభాగ్యం,పవిత్రత మరియు శుభానికి సంకేతం. కుంకుమార్చనలో దేవతా నామాలను జపించి,ప్రతి నామానికి చిటికెడు కుంకుమను సమర్పిస్తారు,ఇది భక్తుడి సమర్పణ, దైవిక శక్తిని ఆహ్వానించడం,కృప మరియు రక్షణను కోరడాన్ని సూచిస్తుంది. ఈ పూజ వల్ల కోరికలు నెరవేరుతాయని,ఐశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసంతో పూజలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ మాజీ సర్పంచ్ బొబ్బల సంధ్యారాణి- మనోహర్ రెడ్డి , పిన్నింటి నరేందర్ రెడ్డి ,గోపిడి నర్సి రెడ్డి ,పిన్నింటి వెంకట్ రెడ్డి , ముక్కాముల రాజు , గుండెబోయిన దిలీప్ గారు,నకిరేకంటి రఘు గారు ,చెరుకు దుర్గా ప్రసాద్ గారు ,జాజుల రవి గారు ,బొబ్బల జనార్దన్ రెడ్డి గారు ,శ్రీ బద్దం అంజి రెడ్డి,కిరణ్ కుమార్ రెడ్డి ,కిరణ్ ,విష్ణు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయంవంతం చేశారు.



