వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి : సబితా ఇంద్రారెడ్డి

వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి :  సబితా ఇంద్రారెడ్డి

  • తుక్కుగూడ మున్సిపాలిటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

విశ్వంభర, మహేశ్వరం: తుక్కుగూడ మున్సిపాలిటీలో కమిషనర్  ఇతర అధికారులతో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి  సమీక్ష సమావేశం నిర్వహించారు.ఎమ్మెల్యే  మాట్లాడుతూ మున్సిపాలిటీలో  అభివృద్ధి కార్యక్రమాలపై ఆరా తీశారు. జరుగుతున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని  ముఖ్యంగా రాబోయేది వేసవికాలం అని  మున్సిపాలిటీలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలని  అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ వాణి రెడ్డి, మేనేజర్ పర్వతాలు, ఆర్ఐ మల్లేష్,  మున్సిపల్ అధికారులు తదితరులు  పాల్గొన్నారు.

Tags: