విశ్వంభర వార్తకు స్పందన - తెలంగాణ తల్లి విగ్రహానికి మరమ్మత్తులు
విశ్వంభర, జగిత్యాల:- జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి మరమ్మత్తులు చేయాలి అని బంగారు దీపక్ డిమాండ్ చేసిన వార్తను ఆగస్టు నెల 14వ తేదీన విశ్వంభర దినపత్రికలో ప్రచురించగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ స్పందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ తల్లి ప్రతిమ మన ఆత్మ గౌరవానికి ప్రతిక ఇది మన చరిత్ర తెలంగాణ ఆవిర్భావానికి గుర్తు ఎక్కడైనా ఇలాంటి విగ్రహాలు దెబ్బతిన్న తక్షణం మరమ్మత్తులు చేయించడం ప్రజాప్రతినిధులే కాక ప్రతి ఒక్కరూ బాధ్యత పంచుకోవాలని మన సంస్కృతి మన స్ఫూర్తిని కాపాడుకోవడం మనందరి ధర్మం అని తెలిపారు. విషయం తెలిసిన వెంటనే మరమ్మత్తులు చేయించేలా చర్యలు చేపట్టి విగ్రహం మరల దర్శించుకునేలా చేశారు. తెలంగాణ తల్లి విగ్రహానికి మరమ్మత్తులు చేశారు . విగ్రహానికి మరమ్మత్తులు పూర్తిచేసిన సందర్భంగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కు కృతజ్ఞతలు తెలిపిన అంబేద్కర్ సంఘం జిల్లా కన్వీనర్ బంగారు దీపక్



