తుపానుగా మారిన రెమాల్.. ఏపీలో భారీ వర్షాలు..!
ఆదివారం ఉదయం తీవ్ర తుపాన్‌గా మారి గంటకు 12కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. ఆదివారం అర్ధరాత్రి సాగర్ ద్వీపం, ఖేపుపరా మధ్య బంగ్లాదేశ్‌ను ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్ మరింత బలపడింది. ఆదివారం ఉదయం తీవ్ర తుపాన్‌గా మారి గంటకు 12కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. ఆదివారం అర్ధరాత్రి సాగర్ ద్వీపం, ఖేపుపరా మధ్య బంగ్లాదేశ్‌ను ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
మంగళవారం వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అయితే తెలంగాణపై ఈ తుపాను ప్రభావం లేకపోయినప్పటికీ రాజస్థాన్, విదర్భ, తెలంగాణ మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు.
మత్స్యకారులు సోమవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. తీరం దాటే సమయంలో 110-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. తుపాను కారణంగా ఏపీ, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, త్రిపుర, మిజోరం, మణిపూర్, నాగాలాండ్, అసోం, మేఘాలయ, అండమాన్ నికోబర్ దీవుల ప్రభుత్వాలను అప్రమత్తం చేశారు.