ఘనంగా ఎంపీ రామ సహాయం రఘురామరెడ్డి జన్మదిన వేడుకలు
విశ్వంభర, జూలూరుపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురామరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు లేళ వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భానసంచలు పేల్చి. కేక్ కట్ చేసి పార్లమెంట్ సభ్యులు రామా సహాయం రఘురామిరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను పకడ్బందీగా ప్రజలకు అందిస్తున్నామని. అన్నారు. కేంద్రంతో కొట్లాడి తెలంగాణ రాష్ట్రానికి నిధులు తెచ్చే విషయంలో రఘురామిరెడ్డి ముందు ఉంటారని అలాంటి పార్లమెంట్ సభ్యులను ఎన్నుకోవడం మన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల యొక్క అదృష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో. జూలూరుపాడు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలోతు మంగీలాల్ నాయక్. లచ్చు నాయక్ .కొలిపాక వెంకటేశ్వర్లు. ముదుగు రామకృష్ణ. వైస్ ఎంపీపీ లాలు నాయక్. నవీన్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు, వేల్పల నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.



