తపాలా శాఖ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన

తపాలా శాఖ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన

విశ్వంభర, నల్గొండ : పోస్టల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్  పిలుపు మేరకు నల్గొండ డివిజన్ లోని తపాలా శాఖ ఉద్యోగులు నల్గొండ హెడ్ పోస్ట్ ఆఫీస్ ప్రాంగణంలో నల్ల బడ్జి లను పెట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశంలోని అన్ని తపాలా కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అంతా కూడా వారి వారి డివిజన్ లలో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. భారత ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన పోస్ట్ ఆఫీస్ యాక్ట్ 2023 ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. అలాగే యు పి ఎస్ పెన్షన్  కాకుండా పాత ఓ పి ఎస్  నే ఇవ్వాల్సిందిగా కోరారు. అలాగే పోస్టల్ సర్వీసెస్ ను ప్రైవేటు పరం చేసే పనులు ప్రభుత్వం విరమించుకోవాలని నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమం లో తపాలా ఉద్యోగులు మురళీ, కృష్ణయ్య, శ్రావణ్, భాగ్యమ్మ, బాలరాజు , సాయి దరనిష్ తదితరులు పాల్గొన్నారు.

Tags: