ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత

ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత

పాలమూరు పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణ

విశ్వంభర,  కొందుర్గు : ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని ఉమ్మడి పాలమూరు పార్లమెంటు సభ్యురాలు డీకే  అరుణ అన్నారు.  బుధవారం కొందుర్గు మండల కేంద్రంలో శివాలయం వద్ద ఉన్న ఆంజనేయ స్వామి నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఇందులో భాగంగా ఆలయ నిర్వహణ కమిటీ చైర్మన్ కందుకముల లక్ష్మయ్య గౌడ్ ఆధ్వర్యంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షులు చిట్టెం లక్ష్మీకాంతరెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య లతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ,ప్రతి ఒక్కరు దైవ మార్గంలో నడవాలని,ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు.మానవసేవే మాధవసేవ అన్నట్లుగా ప్రజలందరూ ఒకరికి ఒకరు సహకరించుకోవాలని,మానవత్వంతో మెలగాలని కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు కందూరి మనోహర్ రెడ్డి,చెంది మహేందర్ రెడ్డి,మోహన్ సింగ్,బోయ అశోక్, అత్తాపురం మహేందర్ రెడ్డి, ప్రభు లింగం పటేల్, సున్నాల అంజయ్య, కారుకొండ సుధాకర్, సురేష్, కాటంరాజు గౌడ్, సత్యనారాయణ రెడ్డి,యాదయ్య,చెన్నయ్య,శ్రీనివాస్, ఎరా రవి, గడ్డమీద రవి,రఘునాథ్ రెడ్డి,లక్ష్మయ్య, శివ రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: