పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి-ఎల్లారెడ్డి
On
విశ్వంభర, పరిగి : ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి మంత్రి వర్గంలో స్థానం కల్పించాలని తొండపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎల్లారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉండి జిల్లాలో నాలుగు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కృషి చేశారని, పరిగి నియోజకవర్గ ప్రజలకు తన సొంత డబ్బులతో అంబులెన్స్ ఏర్పాటు చేశారని, తన నివాసం వద్ద హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసి పేదలకు మెరుగైన వైద్యం అందే విధంగా కృషి చేశారన్నారు.