అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ సాధించిన నారాయణ విద్యార్ధులు
నేషనల్ స్పేస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన "లివ్ ఇన్ వెల్త్ స్పేస్ కాంటెస్ట్ లో హైటెక్ సిటీ నారాయణ పాఠశాలకు చెందిన విద్యార్ధులు తమ సత్తా చాటారు. నాసా పర్యవేక్షణలో జరిగే ఈ పోటీల్లో ప్రపంచ వ్యాప్తంగా, కెనడా, బల్గేరియా, అమెరికా, రోమేనియా లాంటి 11 దేశాలకు చెందిన 90,000 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. హైటెక్ సిటీ బ్రాంచ్ 8 వ తరగతికి చెందిన పూజిత, గాన శ్రీప్రజ్ఞ, శ్రీవక్షిణి, అభిషేక్ రాజ్, హితేష్ విజేతలుగా నిలిచారు. తమ సృజనాత్మకతకు, పరిశోధనను జోడించి మార్షియన్ బయాసిస్" అనే ప్రాజెక్ట్లని రూపొందించి, ఈ విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా, ప్రిన్సిపాల్ రోహిణి మాట్లాడుతూ, అంతరిక్షంలో వ్యవసాయం అనే అంశం పై విద్యార్థులు ఆలోచించిన తీరు ప్రశంసనీయమని తెల్పారు. ఓ.యం. గోపాల్ రెడ్డి . విజేతలను, వీరికి సహయ సహకారాలు అందించిన ఉపాధ్యాయ బృందాన్ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎ.ఓ.యం శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ వి.యం. రోహిణి, వైస్ ప్రిన్సిపాల్ వంశీ, పావని, ప్రకాశ్, సెల్వి, అహ్మదు పాల్గోన్నారు.