నంది హిల్స్ గణనాథుడి నిమజ్జనం 

ఆలయ కమిటీ ప్రెసిడెంట్ పెసరు నరసింహారెడ్డి వెల్లడి.

నంది హిల్స్ గణనాథుడి నిమజ్జనం 

విశ్వంభర హనుమకొండ జిల్లా :- హన్మకొండ హంట్టర్ రోడ్డు నంది హిల్స్ లోని   శ్రీ పంచముఖ  హనుమాన్ దేవాలయంలో  గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వినాయకుడి నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పంచముఖ హనుమాన్ గుడి కమిటీ సభ్యులు.  శుక్రవారం చివరి రోజున గణనాథుడికి అర్చనలు నైవేద్యాలు సమర్పించారు. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ పెసరు నరసింహ రెడ్డి మాట్లాడుతూ శ్రీ గణనాథుని నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ నిత్య అన్నదానాలు అన్నారు అదేవిధంగా  నంది హిల్స్లోని ప్రజలకు ఆ గణనాథుడి దీవెనలు ఆశీర్వాదాలు ఉండాలని  కోరుకుంటున్నామని  అన్నారు  గత మూడు సంవత్సరాల నుండి మొదటి సంవత్సరం ప్రథమ బహుమతి రెండవ సంవత్సరం ద్వితీయ బహుమతి మూడవ సంవత్సరం ప్రోత్సాహక బహుమతి లభించినయని తెలిపారు  చివరి రోజున వినాయకుని లడ్డు వేలం పాటలో గుర్రం రవికుమార్ లక్ష 65 వేలకు లడ్డులు కైవసం చేసుకున్నారు గత సంవత్సరం కూడా   లక్షల 49 వేలకు కైవసం చేసుకున్నందుకు గాను వారి కుటుంబ సభ్యులు ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ పెసరు నరసింహారెడ్డి ఆలయ కమిటీ సభ్యులు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

Tags: