టిఎస్జేయూ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
విశ్వంభర, భూపాలపల్లి : గణపురం మండలం మాధవరావు పల్లి గ్రామంలో బుధవారం భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ నూతన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ను మార్యద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు నూతన కమిటీ సభ్యులకు శాలువా కప్పి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్ట్ ల సంక్షేమం కోసం నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్, జయశంకర్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్, సంయుక్త కార్యదర్శి కడపాక రవి, కోశాధికారి శేఖర్ నాని, ఈసి మెంబెర్ కె.దేవేందర్ తదితరులు ఉన్నారు.



