సచివాలయంలో మిషన్ భగీరథ పై మంత్రి సీతక్క సమీక్ష

సచివాలయంలో మిషన్ భగీరథ పై మంత్రి సీతక్క సమీక్ష

విశ్వంభర,  హైదరాబాదు : సచివాలయంలో మిషన్ భగీరథ పై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖల మంత్రి సీతక్క సమీక్ష కార్యక్రమంనిర్వహించారు. మిష‌న్ భ‌గీర‌థ నీటి స‌ర‌ఫ‌రా వివ‌రాల‌ను మంత్రికి అధికారులు నివేదించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్క‌డా తాగునీటి స‌మ‌స్య లేద‌ని అధికారులు తెలిపారు. ఏదేని గ్రామంలో స‌మ‌స్య‌లు  త‌లెత్తిన వెంట‌నే స‌మ‌స్య‌ను ప‌రిష్కరిస్తున్నామ‌న్న అధికారులు.  ప్ర‌తి రోజు ఉద‌యం 8 గంట‌ల‌కు జిల్లా అధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హించి తాగునీటి స‌మ‌స్య‌లు లేకుండా చూస్తున్నామ‌ని అధికారులు తెలిపారు. మంత్రి సీత‌క్క‌ మాట్లాడుతూ వేసవి లో ఎలాంటి తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముంద‌స్తు జాగ్రత్తలు తీసుకోవాలని, రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు చెక్ చేయాలని పేర్కొన్నారు. విద్యుత్ శాఖ‌తో స‌మ‌న్వ‌యం చేసుకుని విద్యుత్ స‌ర‌ఫ‌రాలో స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా చూడాల‌ని ఆదేశాలు జారీ చేశారు. పంప్ హౌస్ మోట‌ర్లలో స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా జాగ్ర‌త్త‌లు , ఈఎన్సీ నుంచి గ్రామ స్ధాయి వ‌ర‌కు మిష‌న్ భ‌గీరథ సిబ్బంది నిరంత‌రం అప్ర‌మ‌త్తంగా ఉండాలి. 
ప్ర‌తి రోజు తాగు నీటి స‌ర‌ఫ‌రాపై జిల్లా అధికారుల‌తో స‌మీక్ష చేప‌ట్టి నివేదిక స‌మ‌ర్పించాలని, ఎక్క‌డైన సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్తినా త‌క్ష‌ణం ప‌రిష్క‌రించాలని కోరారు.  తాగునీటి అవ‌స‌రాలు తీర్చేందుకు అవ‌స‌ర‌మైతే జిల్లా క‌లెక్ట‌ర్ల కు ప్ర‌త్యేక ఫండ్ కేటాయించే అంశాన్ని ప‌రిశీలిస్తున్నామని అన్నారు.

Tags: