సామాజిక కార్యక్రమాల్లో మాస్టర్ మైండ్స్ స్కూల్

సామాజిక కార్యక్రమాల్లో మాస్టర్ మైండ్స్ స్కూల్

విశ్వంభర, హైదరాబాద్ : పిల్లలకు విద్యతో పాటు సామాజిక కార్యక్రమాల్లో ది మాస్టర్ మైండ్స్ స్కూల్ ముందు ఉండటం అభినందనీయమని  హయత్ నగర్ ట్రాఫిక్ సిఐ బి.గట్టుమల్లు అన్నారు. హయత్ నగర్ మాస్టర్ మైండ్స్ స్కూల్ ప్రిన్సిపాల్  కోట్ల సంధ్యారాణి ఆధ్వర్యంలో ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దు అనే అంశంపై సోషల్ అవేర్ నెస్కార్యక్రమాన్ని నిర్వహించారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దు అనే బ్యానర్ ను పట్టుకుని విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా మాస్టర్  మైండ్స్ స్కూల్ ప్రిన్సిపాల్ ను,సిబ్బంది,విద్యార్థులను సిఐ గట్టుమల్లు అభినందించారు. భవిష్యత్ లో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ మైండ్స్ స్కూల్ హయత్ నగర్ బ్రాంచ్ అకౌంటెంట్ బొల్లి రమ్యశ్రీ,స్కూల్ స్టాఫ్ పాల్గొన్నారు.WhatsApp Image 2025-02-22 at 4.13.31 PM

Tags: