ఘనంగా ప్రారంభమైన మార్కండేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
ఎద్దుల శకుటం పైన ఏర్పాటుచేసిన నేత మగ్గంపై స్వామి - అమ్మవార్ల పట్టు వస్త్రాల తయారీ
On
విశ్వంభర, చండూరు: పట్టణంలోని మార్కండేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. విఘ్నేశ్వర పూజ, స్వస్తివాచనము, అంకురార్పణ, మంటపారాధన, అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణ నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో స్వామి, అమ్మవార్లకి ధరింపజేసే పట్టు వస్త్రాలను 50 జతల ఎద్దుల శకటము( ఎద్దుల బండి)పై సృష్టించి బ్రహ్మాండమైన ఊరేగింపు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమాల్లో, భక్తులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. రాత్రి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ రావిరాల నగేష్ తెలిపారు.



