ప్రజా సేవే లక్ష్యంగా మారియా ఆశ ఫౌండేషన్.
విశ్వాంభరం, నాగారం: ప్రజలకు ప్రజా సేవే లక్ష్యంగా మరియా ఆశా ఫౌండేషన్ స్థాపించినట్లు ఫౌండేషన్ వ్యవస్థాపకులు పేరాల ప్రవీణ్ ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పేరాల సునీత శ్రీనివాసులు తెలిపారు. సోమవారం మండల పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో పదిహేను మంది డప్పు కళాకారులకు మరియా ఆశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డప్పులు పంపిణీ చేశారు. మాట్లాడుతూ ఆశా కార్యకర్తగా పనిచేసి గ్రామంలో సేవలందించి ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన పేరాల మరియమ్మ జ్ఞాపకార్ధంగా మరియా ఆశ ఫౌండేషన్ స్థాపించినట్లు తెలిపారు. ప్రజాసేవే ఊపిరిగా జీవించిన ఆమె ఆశయ సాధన కోసమే ఫౌండేషన్ కృషి చేస్తుందని అన్నారు. ప్రజాసేవ చేసేందుకు మరియా ఫౌండేషన్ ఎల్లప్పుడు ముందు వరుసలో ఉంటుందని అన్నారు. ఫౌండేషన్ మునుముందు అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరాల ఈశ్వర్ రాష్ట్ర కోశాధికారి పేరాల వీరేష్ మరియు డప్పు కళాకారులు తదితరులు పాల్గొన్నారు.



