అంతర్జాతీయ మాతృ భాషా సదస్సులో మల్లారెడ్డి

అంతర్జాతీయ మాతృ భాషా సదస్సులో మల్లారెడ్డి

విశ్వంభర, కరీంనగర్: డ్రెసెంటేషన్ ఫ్రాన్స్ దేశం పారిస్ నగరంలోని యునెస్కో ప్రధాన కార్యాలయంలో ఈనెల 24 నుండి 26 తేదీలలో జరుగుతున్న అంతర్జాతీయ మాతృభాషా రజితోత్సవ సదస్సులో డా కొత్తిరెడ్డి మల్లారెడ్డి పాల్గొని తన పరిశోధనాంశాన్ని ప్రెజెంటేషన్ చేసారు. డా. మల్లారెడ్డి మాట్లాడుతూ యునెస్కో ప్రపంచ వ్యాప్తంగా 8324 భాషలను గుర్తిస్తే అందులో సుమారు ఐదవ వంతు భాషలు భారతదేశంలో మాట్లాడుతూన్నారని అన్నారు. ఏతే మన ఇండియా కేవలం 22 భాషలను మాత్రమే అధికారిక భాషలుగా గుర్తించి భారతరాజ్యాంగ 8వ షెడ్యూల్డులో చేర్చగా ఆ భాషల్లో మాత్రమే అధికారిక కార్యక్రమాలు, విద్యాబోధన నిర్వహించ బడుతున్నాయి. ముఖ్యంగా 2047 లోగా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఏర్పడబోతున్న క్రమంలో భారతరాజ్యాంగం కల్పించిన ప్రధాన హక్కులు సమానత్వం, వాక్కు స్వాతంత్య్రం మరియు అందరికి సమాన విద్యావకాశాలు షెడ్యూలులో లేని, పరిపాలనకు దూరంగా ఉన్న భాషలకు అందుబాటులోకి తీసుకు రావడమే తన పరిశోధన లక్ష్యమని మల్లారెడ్డి పేర్కోన్నారు. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేన్ (యు.పి.ఐ) తరహాలో యూనిఫైడ్ లాంగేజ్ ఇంటర్ఫేస్ (యు.ఎల్. ఐ) రూపకల్పన ద్వారా ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దానికి ప్రభుత్వం సహకారం అందించాలని, పరిశోధకులు, భాషావేత్తలు మరియు సాంకేతిక నిపుణులు కలసి కృషి చేస్తే, ఇది సాధ్యమవు తుందని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి సుమారు 400 వందల మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. డా. కొత్తిరెడ్డి మల్లారెడ్డి యునెస్కో సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రిన్సిపాల్ డా. పి ఇందిరాదేవి, టి.జి.సి.జి.టి.ఎ. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కె సురేందర్ రెడ్డి, ఎస్ ఆర్ ఆర్ ఐడి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ, అకాడమిక్ కోఆర్డినేటర్ కె లింగారెడ్డి, ఐక్యూఎసి కోఆర్డినేటర్ డాక్టర్ బి రేణుక, స్టాఫ్ సెక్రెటరి కె నరెందర్ అధ్యాపకులు డా.జె.సరళఝాన్సీ, డా.జి.ఓదెలు, హెచ్.పల్లవి, డా.బి.సుమలత, వి.రమ, ఐ.మంగమ్మ, డా.బి.మహిపాల్ రెడ్డి, డా.వి.స్వరూపారాణి, డా.జి.స్వప్న, ఎ.శ్రీధర్ విద్యార్థినీ విద్యార్థులు అభినందనలు తెలిపారు.

Tags: