కురవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహాశివరాత్రి సన్నాహక సమావేశం

కురవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహాశివరాత్రి సన్నాహక సమావేశం

విశ్వంభర, మహబూబాబాద్: జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ జి మురళీధర్ ఆదేశానుసారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి ఆసౌకార్యాలు కలగకుండా వైద్య పరంగా తీసుకోవలసిన ముందు జాగ్రత్తల గురించి కురవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ప్రాథమిక ఆరోగ్య వైద్యాదికారులు, సిబ్బందితో ప్రోగ్రాం అధికారులు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ సుధీర్ రెడ్డి డాక్టర్ నాగేశ్వరరావు డాక్టర్ సారంగం, డాక్టర్ విజయ్, డాక్టర్ శ్రవణ్ మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పక్షాన నాలుగు ప్రదేశాలలో ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అవి కురివి వీరభద్ర స్వామి ఆలయం ఎగ్జిట్ గేటు వద్ద ప్రధాన శిబిరం  ఏర్పాటు చేయడం జరిగిందనీ అంతేకాకుండా కళ్యాణ మండపము ఉపకేంద్రంమరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈ ప్రధమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా ప్రతీ ప్రధమ చికిత్స కేంద్రాలలో ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఒక టీం 
రాత్రి 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు ఇంకొక టీం రెండు విడతలుగా 64 మంది సిబ్బందికి డ్యూటీలు వేయడం జరిగిందని, వీటి పర్యవేక్షణకై ప్రోగ్రాం అధికారులను క్యాంప్ ఇంచార్జ్ ఆఫీసర్లుగా నియమించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కురవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ వీరాజిత, డిప్యూటీ మాస్ మీడియా అధికారి ప్రసాద్, హెల్త్ ఎడ్యుకేటర్ కెవి రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ రామకృష్ణ, సిహెచ్ ఓ శ్రీహరి, ఎం పి హెచ్ ఈ ఓ ఎండి గౌస్, పీడీఎంవోలు, ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags: