కాళేశ్వరం లో మహాశివరాత్రి ఉత్సవాలు 25న ప్రారంభం
On
విశ్వంభర, కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వర క్షేత్రంలో ఈ నెల 25 నుంచి మూడు రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. 25న గణపతి పూజతో ఉత్సవం ప్రారంభం అవుతుందని, సాయంత్రం ఊరేగింపు, ఎదుర్కోలు సేవ, 26న సాయంకాలం 4.35 గంటలకు శుభానంద ముక్తీశ్వర కల్యాణం, రాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజ, 27న ఆదిముక్తీశ్వరాలయంలో స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ఉప ప్రధాన అర్చకులు ఫణీంద్ర శర్మ తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామి వారిని దర్శించుకొని, రుద్రాభిషేకం పూజలు నిర్వహించుకోవాలని అర్చకుడు పేర్కోన్నారు.



