హనుమకొండ అభయ ఆంజనేయ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు

హనుమకొండ  అభయ ఆంజనేయ ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు

విశ్వంభర, హనుమకొండ : అభయ ఆంజనేయ ఆలయం చైర్మన్ గ్యాధరబోయిన రాజు ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ  మహాశివరాత్రి రోజు భక్తులు శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.  రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేస్తూ భగవంతుడు సేవలో తరిస్తారు.  కొందరు శైవ క్షేత్రాలలో జరిగే ఉత్సవాల్లో పాల్గొనడం శివ కథ పారాయణాలు శివనామస్మరణం చేయడం పాటలు వినడం వంటివి చేస్తుంటారు.  కార్యక్రమంలో 
ఆలయ చైర్మన్  మార్కెట్ డైరెక్టర్ గ్యాదేర బోయిన రాజు  (రైతు రాజు), బిజిలి సంపత్, సెక్రెటరీ పెద్దబోయిన, నాగరాజు, కమిటీ సభ్యులు పోతరబోయిన అంకూస్ బాబు, పబ్బ శ్రీనివాస్, కల్లే వినోద్ రావు, ఓజ్జల ఐలయ్య, తిక్క సాంబశివుడు, తిక్క రవి, వేముల సంతోష్, పూజారి కొగిల్వాయి సాంబయ్య, భక్తులు కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: