ప్రాచీన దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

ప్రాచీన దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

విశ్వంభర, సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని ప్రాచీన ఉమామహేశ్వర దేవాలయం బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. సోమవారం కార్యక్రమంలో మొదట అఖండ దీపారాధన, గణపతి పూజ, జండా పూజ ను భక్తిశ్రద్ధలతో స్వామివారికి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శివాలయం అధ్యక్షులు పాలకూర్ల సతీష్ గౌడ్, గౌరవ అధ్యక్షులు వీరమల్ల కేశవులు గుప్తా, పాలకూర్ల  యాదయ్య గౌడ్, పాలకూర్ల గిరి గౌడ్, సూరపల్లి జవహర్, పట్నం రాములు గౌడ్,సోమనబోయిన కృష్ణ కుమార్ యాదవ్, జనార్దన్ రెడ్డి, రాజయ్య, శ్రీశైలం, వెంకటేష్ గౌడ్,లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags: