ఆరు గ్యారంటీ ల అమలు కోసం పోరాడుదాం
విశ్వంభర, మహబూబాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలనీ కోరుతూ ఫిబ్రవరి 20 వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనీ కోరుతూ మహబూబాబాద్ పట్టణంలోని మాధవన నగర్ కాలనీలోపోస్టర్లు ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ముఖ్య వక్తగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ మండల వెంకన్న పాల్గొని మాట్లాడుతూ ఎన్నికలలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను 100 రోజులలో అమలు చేస్తామని చెప్పి నేటికీ 14 నెలలు అయినా ఇప్పటివరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప ఏ ఒక్క గ్యారెంటీలను కూడా పూర్తిగా అమలు చేయలేదని, రైతు ల రుణాల మాపి చేయలేదని , కౌలు రైతు లకి రైతు బంధు కూడా వేయలేదని,ఒక్క ఇంధీరమ్మ ఇళ్ళు కూడా మంజూరు చేయలేదని, వృద్దుల, వితంతు, వికలాంగుల పెన్షన్ ఇంకా పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు గ్యారంటీలను అమలుచేయకుంటే తెలంగాణ లో ప్రజా ఉద్యమాలను మరింత ఉదృతం చేస్తా మనీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సామ పాపయ్య, బట్టు చైతన్య, ఐ ఎఫ్ టి యు జిల్లా కోశాధికారి తెలబోయిన లక్ష్మయ్య, కాలనీవాసులు అల్లి ఏకాంబరం, గువ్వ శ్రీను, కందుకూరి శ్రీను, జయలచ్చమ్మ, చిల్ల ఉప్పలయ్య, పట్టాభి మల్లేశం, సుధాకర్, భాగ్యమ్మ, హైమా, యాకయ్య, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు



