చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి. - అధ్యక్షులు రాపోలు వీర మోహన్
విశ్వంభర, హైదరాబాద్ :- తెలంగాణ రాష్ట్ర చేనేత ఐక్య వేదిక ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 110 వ జయంతిని పురస్కరించుకొని చేనేత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీర మోహన్ అధ్యక్షతన తుర్క యంజాల్ ప్రధాన కార్యాలయంలో బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ 1941 లో గాంధీజీ ని కలిసి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్, మంత్రి పదవి ఎన్ని పదవులు నిర్వహించినా ఆయన ఆరాటం తెలంగాణ గురించే. ఉద్యమంలో యువకులు చనిపోయినప్పుడు తెలంగాణ వచ్చే వరకు ఏ పదవి అధిష్టించనని జీవితాంతం పోరాడారు. చేనేత శాఖ మంత్రిగా ఆ రోజుల్లోనే చేనేత కార్మికుల కోసం కృషి చేశారు. మలి దశ ఉద్యమంలో సొంత ఇంటిని ఉద్యమం కోసం ఇచ్చేశారు. 97 ఏళ్ల వయసులో మైనస్ డిగ్రీల చలిలో కూడా ఢిల్లీలో తెలంగాణ కోసం దీక్ష చేశారు. బాపూజీ ఆశయాలను సాకారం కోసం నిరంతరం ఐక్య వేదిక ముందుటుందని అన్నారు. చేనేత కార్మికుల సమస్యల పై బాపూజీ ఆశయాలకు అనుగుణంగా పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ముఖ్య అతిధిగాబి బి ఎన్ రెడ్డి కాంటెస్టెడ్ కార్పొరేటర్ గద్దె విజయ్ నేత పాల్గొని బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి జెల్ల రఘు , ఉపాధ్యక్షులు జెల్ల పర్వతాలు , వనం చంద్రమౌళి , చెరుకు మల్లయ్య , రాష్ట్ర కార్యదర్శి కర్నాటి అశోక్ , ఐక్య వేదిక మహిళా ఉపాధ్యక్షురాలు సామల స్వప్న , గ్రేటర్ హైదరాబాద్ చేనేత ఐక్య వేదిక ఉపాధ్యక్షులు చెరుకు విజయ్, సామల మహేష్ తదితరులు పాల్గొన్నారు.



