కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణి

కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణి

విశ్వంభర, హైదరాబాదు: హిమాయత్ నగర్ మండల కార్యాలయం వద్ద మంగళవారం సాయంత్రం ముషీరాబాద్ నియోజకవర్గం శాసనసభ సభ్యులు ముఠా గోపాల్ కార్పొరేటర్ రచన శ్రీ, ఎమ్మార్వో సంధ్యారాణి చేతులమీదుగా 26 మందికి ప్రభుత్వం తరఫున కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బారాస  భాజపా  నాయకులు పాల్గొన్నారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు ఏమి ఉన్నను తన దృష్టికి తీసుకురావాలని ప్రజలకు ప్రజా ప్రతినిధులమైన మేము ఎప్పటికీ అందుబాటులో ఉంటామని అదేవిధంగా ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించాడు.

Tags: