చనిపోయిన వ్యక్తి కుటుంబానికి అండగా జయశంకర్ ఫౌండేషన్

చనిపోయిన వ్యక్తి కుటుంబానికి అండగా జయశంకర్ ఫౌండేషన్

విశ్వంభర, భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగే గ్రామానికి చెందిన పొలంపల్లి బిక్షపతి  సతీమణి పోలంపల్లి నీలమ్మ  ఇటీవల గుండెపోటుతో చనిపోయింది.  వారి నిరుపేద కుటుంబ పరిస్థితి గురించి తెలుసుకున్న ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి 3000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సాగర సంగం జిల్లా ప్రెసిడెంట్ దేవునూరి చంద్రమౌళి , చల్లగరిగే హైస్కూల్ విద్యా కమిటీ ఎక్స్  చైర్మన్ కనుకుల ప్రభాకర్ , సాగర సంగం జిల్లా కోశాధికారి పొలంపల్లి సుధాకర్  , సాగర సంగం గ్రామ అధ్యక్షులు పొలంపల్లి అనిల్, కాటిపెల్లి సదానందం, కొల్లూరి రాకేష్, పొలంపల్లి రాజు, పొలంపల్లి శ్రీనివాస్,   తదితర సభ్యులు పాల్గొన్నారు.

Tags: