బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకోము
- కులగణనపై రీసర్వే చేయాలి
- -ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశం గౌడ్
విశ్వంభర, హైద్రాబాద్: ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి క్యాష్... తన క్యాస్ట్ మాత్రమే కావాలని, బడుగు, బలహీనవ ర్గాల గోస పట్టదని ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఓరుగంటి వెంకటేశం గౌడ్ ఎద్దేవా చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కామా రెడ్డి డిక్లరేషన్ లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహి స్తామని చెప్పి నేడు సీఎం మాట మార్చా రని, ఒకవేల అంత శాతం కేటాయిస్తే ముస్లిం లకు 10 శాతం పోగా, మిగిలేది 32 శాతమే నని విమర్శించారు. చట్టబద్దత చేయమని అడిగితే మొక్కుబడిగా టికెట్లు ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారన్నారు. కుల గణన సర్వే రిపోర్టు తప్పుల తడకగా ఉందని, లక్షలాది మంది బీసీలను మాయం చేశారని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కేవలం 50 శాతం మాత్రమే సర్వే చేశారని, ఓబీసీ నేత నైనా తన ఇంటికే సర్వే అధికారులు రాలేదని చెప్పారు. మరో వైపు రాహుల్ గాంధీ గత ఎన్నికలకు ముందు బీసీలకు 50 శాతం రిజ ర్వేషన్లు కల్పిస్తామని, బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని, లక్ష కోట్ల నిధులు కేటాయిస్తామని నోటికొచ్చిన హామీలు ఇచ్చారని, కాని తీరా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నోరు మెదపడం లేదన్నారు. రీసర్వే చేయిం చాలని లేని పక్షంలో రాష్ట్రం అగ్ని గుండంలా మారుతుందన్నారు. ఈ సమావేశంలో తెలం గాణ బీసీ కులాల సమన్వయ వేదిక నేత రఘురాం నేత, పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి జెల్లా నరేందర్ నేత, దుస్స యాద గిరి, కోల జనార్దన్ గౌడ్, ఎర్రోజు భిక్షపతి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు



