ఘనంగా పద్మశాలి బిజినెస్ నెట్వర్క్ మీట్ -లోగో ప్రారంభించిన : పరికిపండ్ల నరహరి IAS,ప్రిన్సిపల్ సెక్రెటరీ,(మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం)
మనల్ని మనం చూసుకోవడంతో పాటు నెట్వర్క్ పెంచుకోవడం చాలా అవసరం
విశిష్ట అతిధులుగా డా. నీరజ ప్రభాకర్ భోగ - వైస్ ఛాన్సలర్ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టీకల్చరల్ యూనివర్సిటీ- చైర్మన్ RAC - ICAR . ప్రముఖ సినీ నటులు ,మొగలిరేకులు సీరియల్ ఫేమ్ RK నాయుడు (ములుకుంట్ల సాగర్ )
హైద్రాబాద్ , విశ్వంభర :- సమాజంలో కుల మతాలకు అతీతంగా సత్సబంధాలు కలిగి ఉండటమే నిజమైన నెట్వర్క్ అంటూ పరికిపండ్ల నరహరి IAS,ప్రిన్సిపల్ సెక్రెటరీ, (మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ) హైదరాబాద్ లో, బేగంపేట లోని టూరిజం ప్లాజా లో ఏర్పాటు చేసిన పద్మశాలి బిజినెస్ నెట్వర్క్ మీట్ లో లోగో లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొనడం జరిగింది .పద్మశాలి బిజినెస్ నెట్వర్క్ మీట్ యొక్క కార్యక్రమం ద్వారా ఒక్కరిగా సాధించలేనిది,ఐక్యతే ప్రధానంగా ఒక సమూహం గా ఏర్పడి వ్యాపార విస్తరణకు నెట్వర్క్ అనేది చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చని అన్నారు.ఇలాంటి మీట్ ల వల్ల వ్యాపారాలను విస్తరించుకోవడమే కాకుండా విభిన్న రకాల క్రొత్తదనం కలిగి ఉన్న వ్యవస్థలకు దగ్గర చేయడంతో పాటు, వ్యాపార వృద్ధికి చేరువ చేస్తుందని అన్నారు .మనల్ని మనం చూసుకోవడంతో పాటు నెట్వర్క్ పెంచుకోవడం చాల అవసమని అన్నారు. ఈ మీట్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టీకల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. నీరజ ప్రభాకర్ భోగ ,మొగలిరేకులు సీరియల్ ఫేమ్ RK నాయుడు (ములుకుంట్ల సాగర్ ) లు పాల్గొని మాట్లాడుతూ పద్మశాలి బిజినెస్ నెట్వర్క్ ను ప్రారంభించిన నిర్వాహకులను అభినందిస్తూ పద్మశాలి వ్యాపారస్తులను ఒక్కతాటిపై ఐక్యంగా తీసుకొని రావడం ఒక నెట్వర్క్ ను క్రియేట్ చేయడం చాలా గొప్ప విషయం అని అన్నారు.ఇది ఇక్కడితో ఆగకుండా దేశవ్యాప్తంగా పద్మశాలి బిజినెస్ నెట్వర్క్ ను విస్తరింపజేయాలని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో గంజి శ్రీనివాస్ నేత , కళ్యాణ్ నేత , కోడె శ్రీనివాస రాజు , నిర్వాహకులు మాట్లాడుతూ కొద్దిమంది తో ప్రారంభమైన ఈ బిజినెస్ నెట్వర్క్ రానున్న రోజుల్లో మరింతగా విస్తృతం చేస్తామని అన్నారు.మీట్ కి వచ్చిన అతిధులను పూల బొకే లను అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు. మీట్ లో భోగ ప్రభాకర్ , చిలువేరు కాశీనాథ్ ,బస్వ లక్ష్మి నర్సయ్య ,కేశవ్ ప్రసాద్ జి , పలువురు బిజినెస్ పర్సన్స్ పాల్గొనడం జరిగింది.