శ్రీరామ హిల్స్ లో గణనాథుని నిమజ్జనం.
విశ్వంభర హనుమకొండ జిల్లా :- శ్రీరామ హిల్స్ హంటర్ హనుమకొండ నందు శ్రీరామ పరపతి సంఘం ఆధ్వర్యంలో శ్రీ మహాగణపతి నవరాత్రి ఉత్సవములు అంగరంగ వైభవంగా వైభవ్వేతంగా నిర్వహించినారు గత తొమ్మిది సంవత్సరాల నుండి కాలనీవాసులు గణపతి నవరాత్రుల ఉత్సవాలు నిర్వహిస్తున్నారు . పేద పండితులు శ్రీ పాకాల శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులు, సంప్రదాయబద్ధంగా ఒక రోజు మహాలక్ష్మి కుంకుమ పూజ, ఒకరోజు సరస్వతీ పూజ, ఒకరోజు మహాలక్ష్మి గణపతి హోమం, ఒకరోజు 108 ప్రసాదలతో మహా నైవేద్య సమర్పణ, ఒకరోజు 1116 ఉండ్రాళ్లతో ఉండ్రాళ్ళ సేవ, ఒకరోజు జ్యోతి అలంకరణ సేవ, ఒకరోజు శాస్త్రీయ నృత్యంలచే సేవ మరియు ప్రతిరోజు మధ్యాహ్నం సాయంత్రం విష్ణు సహస్ర పారాయణం,, లలితా సహస్ర పారాయణం, హనుమాన్ చాలీసా, చివరి రోజున మహా అన్నసంతర్పణ కార్యక్రమాలను వైభవ్వేతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు సుమారు 200 మంది భక్తులు, 40 మంది చిన్నారులు చివరి రోజున కాలనీలోని ఉద్యోగ విరమణ పొందిన 13 మంది పెద్దలకు, పెద్దవారిని, అనుభవజ్ఞులను గౌరవించాలని ఉద్దేశంతో వారిని ఉపాధ్యాయ దినోత్సవం రోజున సన్మానించడం జరిగింది. ఈ తొమ్మిది రోజుల కార్యక్రమాల్లో వివిధ రకాల పోటీలలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు బహుమతి ప్రధానం జరిగినది.మహా అన్న సంతర్పణ కార్యక్రమంలో సుమారు 700 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ పరపతి సంఘం అధ్యక్షులు కత్తెరసాల వెంకటేశ్వర్లు , ప్రధాన కార్యదర్శి గుజ్జుల రామచంద్రం, ఉపాధ్యక్షులు సత్తు రమేష్, కోశాధికారి గాయపు మాధవరెడ్డి, బొంతల వీరన్న, సలహా సంఘం సభ్యులు వేల్పుల మోహన్ రావు, పుప్పాల తిరుమల్, రేకులపల్లి చంద్రశేఖర్, కొండం జయపాల్ రెడ్డి పిన్నింటి వీరారెడ్డి,పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి, బండి యాదగిరి, సారంపల్లి వెంకటరెడ్డి, లెక్కల మహేందర్ రెడ్డి, చంద్రారెడ్డి శివ నాగ కుమార్, రావు లక్ష్మణరావు, హోమాండ్ల లక్ష్మణరావు, లక్కాకుల అశోక్, పడిదెల రాజేశ్వరరావు, దుగ్యాల సురేందర్రావు, కంచర్ల జనార్దన్ రావు, అన్నమనేని వీర సంజీవరావు, నల్ల రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు



