శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో తుమ్మల కుటుంబ సభ్యులు..

శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో తుమ్మల కుటుంబ సభ్యులు..

విశ్వంభర, సంగారెడ్డి జిల్లా :  అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని  అమీన్పూర్ గ్రామం  పెద్ద చెరువు దగ్గర అమీన్పూర్ మున్సిపల్  మాజీ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో  శ్రీ దుర్గా భవాని మాత సహిత శ్రీ నాగ లింగేశ్వర స్వామి దేవాలయంలో రెండో రోజున  శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తుల మధ్య కళ్యాణ మహోత్సవం కనుల పండుగగా జరిగిందని మాజీ చైర్మన్ అన్నారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ మా తాతల కాలం నుండి నాగులమ్మ గుడి ఉండేది దాని తర్వాత గుడిని పుననిర్మానం చేసుకొని  శ్రీ దుర్గా భవాని మాత శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో కట్టుకొని సముద్రం అయిపోయి రెండో సంవత్సరం లకు అడుగుపెట్టడం జరిగింది. ఈ ఆలయంలో మొదటిసారి శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించుకున్నాం మొదటి రోజు శివరాత్రి పురస్కరించుకొని సుమారు 800 మంది భక్తులు స్వామివారినిదర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్స్, బాసేటి కృష్ణ, బోయిని బాలరాజు, కొల్లూరి  గోపాల్, సత్యనారాయణ రెడ్డి, తలారి రాములు, దాసు యాదవ్, నల మధు రెడ్డి,తుమ్మల ప్రభాకర్ రెడ్డి, తుమ్మల ప్రతాప్ రెడ్డి, తుమ్మల రుశ్వంత్ రెడ్డి, కొండకల శీను, కొల్లూరుయాదగిరి,రాధాకృష్ణ,గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags: