ఉత్సాహంగా స్వయం పరిపాలన దినోత్సవం
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ మండలంలోని పిక్లా తండా శివారు బోడగుట్ట తండా ప్రాథమిక పాఠశాలలో సోమవారం స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి మాట్లాడుతూ ఈ పాఠశాలలో విద్యతోపాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పాఠశాలలో రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో భాగంగా ఉదయం నుంచి విద్యార్థులు ఉపాధ్యాయులుగా పాఠాలు బోధించడం గ్రామస్తులను ఆకట్టుకుంది. అలాగే దేశం మనదే, మేమే ఇండియన్స్, మీ ప్రేమ కోరే చిన్నారులం, గురుబ్రహ్మ గురుర్విష్ణు వంటి అనేక నృత్యాలు, పద్యాలు, పాటలు, జీకే మొదలగు కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు డివి రమణ, కాంప్లెక్స్ కార్యదర్శి కళ్లెం వీరారెడ్డి, ఉపాధ్యాయులు గనె యాదగిరి, గనే పావని, ఏఏపీసీ ఛైర్మన్ అనిత, అంగన్వాడి టీచర్ గుగులోతు నీలా, బానోతు పద్మ, గ్రామస్తులు నరేష్, వెంకన్న, నరేష్, వినోద, కల్పన,సరోజ, శిరీష , పద్మ, సాలమ్మ, కొరియో గ్రాఫర్ అవంతిక ఆంగోతు,తదితరులు పాల్గొన్నారు.



