చేప మందు ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లను పరిశీలించిన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి

చేప మందు ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లను పరిశీలించిన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి

WhatsApp Image 2024-06-06 at 3.35.38 PM (1)విశ్వంభర : హైదరాబాద్‌లో చేప మందు ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేసేందుకు విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మృగశిరకార్తె ప్రారంభం కానున్నందున ఈనెల 8వ తేదీ నుంచి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేపల ప్రసాదం పంపిణీ చేయనున్నారు.ఎగ్జిబిషన్ గ్రౌండ్లో  నాంపల్లి లో జరిగే చేప ప్రసాద పంపిణి ఏర్పాట్లను ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ , ఫిషరీస్ జాయింట్ కమీషనర్ శంకర్ రాథోడ్ మరియు ఏసీపీ చంద్రశేఖర్ లతో  కలిసి పర్యవేక్షించారు . ఈ సందర్భముగా మాట్లాడుతూ బత్తిన కుటుంబ సభ్యుల  ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తారని , ఈ మందు దివ్యౌషదంలా పనిచేస్తుందని తెలుగు రాష్ట్రాల ప్రజల విశ్వాసం అని తెలిపారు . దీంతో తెలంగాణ, ఏపీతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివస్తుంటారని . ఈ మేరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రత్యేక  కౌంటర్లు ఏర్పాటు చేసి సీక్వెన్షియల్ ఆర్డర్‌లో ఈ మందును అందజేసే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు WhatsApp Image 2024-06-06 at 3.35.39 PM