బాలగంగాధర్ తిలక్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదానం
On
విశ్వంబర / అయోధ్య నగర్ ఉప్పుగూడ:- బాలగంగాధర్ తిలక్ యూత్ అసోసియేషన్ అయోధ్య నగర్ ఉప్పుగూడ ఆధ్వర్యంలో 2001లో సంపత్ కుమార్ 8 ఫీట్లతో తో మొదలుపెట్టగా, ప్రస్తుతం M వెంకటరమణ 2019 నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ కమిటీలో ప్రస్తుతం10 మంది సభ్యులతో, నిర్విరామంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు అన్నదానం సందడిగా సాగిందని, మా కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా మాకు చేదోడు వాదోడుగా ఉండడంవల్ల అన్ని కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయని, మా సభ్యులు గౌతమ్ రాజ్, నవీన్, అరుణ్ రాజ్, ఉదయ్ రాజ్, వరుణ్, వినయ్, రోహిత్, భీమేష్ తదితరుల సహాయ సహకారంతో కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నామని తెలిపారు.



