శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ భవనంలో దసరా నవరాత్రి ఉత్సవాలు
On
విశ్వంభర, గౌలిపుర :- దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ భవనంలో శివుడికి రుద్రాభిషేకం, కన్యకా పరమేశ్వరి మాతకు అష్టోత్తరములతో కుంకుమార్చన కార్యక్రమం, పంచాభిషేకం, అన్న ప్రసాదం కార్యక్రమాలు సరాబు సంతోష్ కుమార్ దంపతులు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగమల్ల సాంబయ్య పాల్గొన్నారు. కార్యవర్గ సభ్యులు చైర్మన్ చీలరాముల గుప్తా,వైస్ చైర్మన్ గుగ్గిల అశోక్ కుమార్ గుప్తా, ప్రధాన కార్యదర్శి సరాబు విశ్వేశ్వరయ్య గుప్త, ప్రధాన కార్యదర్శి చాలికే నాగరాజు గుప్తా, కోశాధికారి గుగ్గిల సంతోష్ కుమార్ గుప్తా, అడిషనల్ కార్యదర్శి పెద్ది నాగేష్ గుప్తా, ప్రధాన కార్యదర్శి సిరంగి సంపూర్ణ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



