దళితుల భూమి కబ్జా.. ! బెదిరింపులకు పాల్పడుతున్న భూకబ్జా దారులు

దళితుల భూమి కబ్జా.. ! బెదిరింపులకు పాల్పడుతున్న భూకబ్జా దారులు

విశ్వంభర, మేడ్చల్ :  బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని చెంగిచెర్లలో పేద దళితులకు చెందిన భూమిని కొంతమంది భూకబ్జా దారులు కబ్జా చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారని ల్యాండ్ ఓనర్స్ అందరూ కాలనీ సంక్షేమ సంఘం చైర్మన్ రాపోలు రాములును ఆశ్రయించగా తను సానుకూలంగా స్పందించి పేద దళితులకు న్యాయం జరిగే విధంగా అండగా ఉంటానని చెంగిచెర్లలో గల రక్షిత కౌలు చట్టం ప్రకారం సర్వేనెంబర్ 31 లో వారి స్థలాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు పరిధిలో ఉన్న భూమిని ఎలాంటి నిర్మాణాలు జరగకుండా సంరక్షించవలసిన మున్సిపల్ రెవెన్యూ అధికారులే అక్రమార్కులకు సహాయం అందిస్తున్నారని, రక్షిత కౌలు చట్టం ప్రకారం బంటు దళిత కుటుంబ వారసులకు అన్ని రకాల హక్కులు ఉన్న దళితుల అన్న కారణంగా స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు అక్రమాలకు పాల్పడుతూ వారిని బెదిరించి అట్టి స్థలాల్లో నిర్మాణాలు చేపడుతున్నారని, దీనిని ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తుందని, దళితులకు న్యాయం జరిగే వరకూ ఫెడరేషన్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి,అధ్యక్షులు అబ్రహం లింకన్, రాంబాబు, నరసయ్య, బంటు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

Read More ప్రభుత్వ, ప్రైవేట్  బ్యాంకుల్లో భద్రతపై   పోలీసుల తనిఖీ

 

Read More ప్రభుత్వ, ప్రైవేట్  బ్యాంకుల్లో భద్రతపై   పోలీసుల తనిఖీ

Tags: