గ్రామాలను సుభిక్షం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం-ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి

గ్రామాలను సుభిక్షం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం-ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి

విశ్వంభర, తలకొండపల్లి: తలకొండపల్లి మండలంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బుధవారం పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మండల కేంద్రం లో 15 లక్షల విలువైన పనులకు అదే విధంగా అంతారం గ్రామంలో 15 లక్షలతో ,వెంకటాపూర్ గ్రామంలో25 లక్షలతో, మరియు వెలిజాల గ్రామంలో 20 లక్షలతో  మొత్తం 75 లక్షల విలువైన  సిసి రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించి ఆయన శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నరసింహ, మండల అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ,మార్కెట్ డైరెక్టర్ అంజయ్య గుప్తా, అజీమ్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags: