సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత
On
విశ్వంభర, దోమ మండల పరిధిలోని రా కొండ గ్రామానికి చెందిన దేవమ్మకు రూ. 50,000లు, అమృతమ్మకు 8,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సోమవారం మాజీ సర్పంచ్ లక్ష్మయ్య వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ లక్ష్మయ్య మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా దరఖాస్తు చేసుకున్న అర్హులకు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య, అంజిలయ్య, శ్రీనివాస్, చంద్రయ్య, శ్రీనివాస్, రుక్ముద్దీన్, చంద్రయ్య, రాములు, పాండు నాయక్, తదితరులు పాల్గొన్నారు.



