హిందూధర్మ సామ్రాజ్య సంరక్షకుడు చత్రపతి శివాజీ మహారాజ్
On
మహనీయులను స్మరించుకుందాం..వారి అడుగుజాడల్లోనే నడుద్దాం
ఘనంగా మరాఠా యోధుని జయంతి వేడుకలు
విశ్వంభర, భూపాలపల్లి : మహనీయులను స్మరించుకొని వారి అడుగుజాడల్లోనే నడవాలని హిందూ హృదయ సామ్రాట్..హిందూ ధర్మ రక్షకుడు..హిందూ సామ్రాజ్య స్వరాజ్ కోసం రాక్షసుల్లాంటి ఢిల్లీ సుల్తానులతో, మొఘలాయిలతో యుద్ధం చేసి, హిందూ దేవాలయాలను, హిందూ మహిళలను రక్షించి మొఘల్ పాలకుల నుండి విముక్తి ప్రసాదించిన హిందూ సామ్రాజ్యాధిపతి, చత్రపతి బిరుదాంకితుడు, మరాఠా పోరాట యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ అని మొగుళ్లపల్లి మాజీ సర్పంచ్ మోటే ధర్మారావు అన్నారు. బుధవారం చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని శివాజీ విగ్రహానికి ఆయన పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.



